New lyric

Wednesday, July 7, 2010

manishai puTTinavaaDu-Adavi RaamuDu-Veturi-1977-krushi unte

Listen to Adavi Ramudu Old Audio Songs at MusicMazaa.com
Movie Name: Adavi RaamuDu
Singers: S P Bala Subramanyam
Lyricist: Veturi Sundara ramurthy
Music Director:  K.V. Mahadevan
Director: K. Raghavendra Rao
Year : 1977

manishai puTTinavaaDu kaaraadu maTTibomma
paTTudalE unTE kaagalaDu marO brahma
kRushi unTE manushulu Rushulautaaru mahaapurushulautaaru
tarataraalakI taragani velugautaaru ilavElupulautaaruu

aDugO ataDE vaalmiikii bratuku vETa atanikii
ati bhayankaruDu yamakinkaruDu aDavi jantuvula paaliTi
aDugO ataDE vaalmiikii
paala piTTala janTa valapu tEnela panTa
panDinchukuni paravaSinchi pOyE vELa
aa pakshula janTaku guripeTTaaDu oka pakshini nEla kuulchaaDuu
janTa baasina pakshi kanTa pongina ganga tana kanTilO ponga manasu karaganga
aa Soakam lO oka SlOkam palikE aa cheekaTi edalO deepam veligE
karaku bOyaDE antarinchagaa kavigaa aataDu avatarinchagaa
manishi ataDilO mElkonnaaDu kaDaku maharShE ayinaaDu
navarasa bharitam raamuni charitam jagatiki aataDu panchina amRutam
aa vaalmiiki meevaaDu meelOnE unnaaDuu
aksharamai mee manasu veligitE meelOnE unTaaDuu
andukE kRushi unTE manushulu Rushulautaaru mahaapurushulautaaru
tarataraalakii taragani velugautaaru ilavElupulautaaruu

EkalavyuDanTEnE edurulEni baaNam tirugulEni deekshaki ataDE praaNam
kulam takkuvani vidyanErpani guruvu bommagaa migilaaDu
bomma guruvugaa chEsukuni baaNa vidyalO perigaaDu
huTaa huTini drONuDapuDu taTaalumani tarali vacchi
pakshapaata budditO dakshiNa immannaaDu
eduTa nilichina guruni padamanTi EmivvagalavaaDa nanE EkalavyuDu
boTanavrElimmane kapaTi aa drONuDu valle yane SishyuDU chelle drONuni muDupu
erukalavaaDu aitEnEmi gurikalavaaDE monagaaDu
vElu icchi tana villunu viDichi vElupugaa ila veligaaDu

Sabari intakaalamu vEchinadi ee pilupukE Sabarii
aaSa karuviDi aDugu taDabaDi raama paadamu kannadi
vangipOyina naDumutO nagumOmu chooDagalEka apuDuu
kanula neeriDI aa raama paadamu kaDiginadi Sabari padamula originadi Sabarii
prEma meeraga raamuDappuDu Sabari talli kanulu tuDichi
Sabari korikana dOra panDlanu aaraginche
aame engili ganga kanna minnagaa bhaavinchina
raghuraamuDentaTi dhanyuDu aa SabaridentaTi puNyamO
aame evvarOkaadu sumaa aaDabaDuchu mee jaatikii
jaati ratnamulu endarendarO meelO kalariinaaTikii
aDavini puTTi perigina kadhalE akhila bhaaratiki haaratulu
naagarikatalO jaagu charitalO meerE maaku saaradhulu

Lyrics in Telugu : 

సినిమా పేరు: అడవి రాముడు
గాయకులు: శ్రీ బాల సుబ్రమణ్యం
రచయిత: వేటురి
సంగీత దర్శకులు: కే వీ మహదేవన్
సినిమా దర్శకత్వం : కే రాఘవేంద్ర రావ్
విడుదల అయిన సంవత్సరం  : 1977

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
కౄషి ఉంటే మనుషులు ౠషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకీ తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారూ

అడుగో అతడే వాల్మీకీ బ్రతుకు వేట అతనికీ
అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి
అడుగో అతడే వాల్మీకీ
పాల పిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయే వేళ
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడూ
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగ
ఆ శోకం లో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా
మనిషి అతడిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు
నవరస భరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమౄతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడూ
అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడూ
అందుకే కౄషి ఉంటే మనుషులు ౠషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకీ తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారూ

ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం
కులం తక్కువని విద్యనేర్పని గురువు బొమ్మగా మిగిలాడు
బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు
హుటా హుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలి వచ్చి
పక్షపాత బుద్దితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడ ననే ఏకలవ్యుడు
బొటనవ్రేలిమ్మనె కపటి ఆ ద్రోణుడు వల్లె యనె శిష్యుడూ చెల్లె ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు ఐతేనేమి గురికలవాడే మొనగాడు
వేలు ఇచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇల వెలిగాడు

శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరీ
ఆశ కరువిడి అడుగు తడబడి రామ పాదము కన్నది
వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడూ
కనుల నీరిడీ ఆ రామ పాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరీ
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి
శబరి కొరికన దోర పండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన
రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరోకాదు సుమా ఆడబడుచు మీ జాతికీ
జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరీనాటికీ
అడవిని పుట్టి పెరిగిన కధలే అఖిల భారతికి హారతులు
నాగరికతలో జాగు చరితలో మీరే మాకు సారధులు
Reference : [1]

0 comments:

Post a Comment